
కరోనా సంక్షోభం తో మూతపడిన పాఠశాలలు సోమవారం నుండి నిబంధనలతో తెరుచుకుంటాయని కేంధ్రప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులను స్కూళ్లకు పంపించడం తల్లితండ్రుల ఇష్టానికె వదిలేశారు. అయితే కరోనా వైరస్ తగ్గకపోవడంతో 78% తల్లితండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించడానికి సిద్ధంగా లేరని ఎస్పీ రోబోటిక్ వర్క్స్ అనే సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలతో పోలిస్తే చెన్నై, కోలకతా వంటి ప్రాంతాలలో 64%తల్లితండ్రులు స్కూళ్లకు పంపించడానికి సిద్ధంగా వున్నారని సంస్థ పేర్కొంది.