
మహారాష్ట్రలోని భీవండిలో ఘోర ప్రమాదం సంభవించింది. భీవండిలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో సోమవారం ఉదయం మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. శిథిలాల కింది మరో 30 మంది వరకు ఉన్నట్లు థానె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. స్థానికులు 25 మందిని కాపాడారు. కాగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో భీవండిలో కలకలరం రేపింది.