
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో 1,302 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 9 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,72,608కి చేరగా 1,042 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్ కేసులు ఉండగా, 22,990 మంది ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నట్లు హెల్ట్‌బులిటెన్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా గ్రైటర్ హైదరాబద్‌లో 266 కేసులు నిర్ధారణ కాగా ఆ తరువాత స్థానంలో కరీంనగర్ 102, రంగారెడ్డి 98 స్థానాల్లో ఉన్నాయి.