వలస కూలీల ఆశలపై నీళ్లు?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకు పోయిన ఉద్యోగస్తులని, వ్యాపారవేత్తలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ యంత్రంగాం ప్రత్యేక విమానాలు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ రూల్స్ ని కేంద్రం సడలించింది. హాట్ స్పాట్ కానీ ప్రాంతాలలో మరి కొన్ని సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ ప్రాంత విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సు సర్వీసులు […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 1:51 pm
Follow us on


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకు పోయిన ఉద్యోగస్తులని, వ్యాపారవేత్తలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ యంత్రంగాం ప్రత్యేక విమానాలు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ రూల్స్ ని కేంద్రం సడలించింది. హాట్ స్పాట్ కానీ ప్రాంతాలలో మరి కొన్ని సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ ప్రాంత విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. కానీ సరైన ప్రణాళిక లేకుండా అమలుపరిచిన లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి వారి సొంత ఇళ్లకు పంపించడానికి మాత్రం మన బడా నేతలకు, అధికారులకు మనసు రావడం లేదు.

అది జనవరి మాసం కరోనా వైరస్ అప్పుడప్పుడే అడుగులో అడుగు వేసుకుంటూ చైనాలోని వుహాన్ లో ముందుకు సాగుతున్న వేళ భారత్ యంత్రంగాం అప్రతమై వెంటనే ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసి ఆ దేశంలో ఉన్న ఉద్యోగులను, వ్యాపార వేత్తలను హుటా హుటీనా భారత్ కి తీసుకొచ్చింది. ఆ తర్వాత కరోనా విజృంభన ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటంతో వివిధ దేశాలలో ఉన్నప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసి మరీ వారందని ఇండియా కి తీసుకొచ్చారు. కానీ దేశ వ్యాప్తంగా ఉన్న వలస కూలీల పట్ల మన భారత్ యంత్రంగాం చాలా చిన్న చూపు చూస్తుందని స్పష్టంగా అర్థమౌతుంది.

Also Read:వలస కూలీల వేదన వర్ణానాతీతం!

పనిలేక-పరాయి పంచన ఉండలేక దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ టైం లో అనేక వేలమంది కార్మికులు వారి వారి గృహాలకు వెళ్లేందుకు మూటాముల్లె సర్దుకొని, చంటి పిల్లలను ఎత్తుకొని, నడుచుకుంటూ బయల్దేరి మార్గం మధ్యలోనే ఇరుక్కుపోయారు. వారందరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ లోనే ఉంటున్నారు. ఇటీవల ముంబయిలో స్వస్థలాలకు వెళ్లిపోతామని వేల మంది రోడ్డెక్కారు. హైదరాబాద్‌ లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఏప్రిల్ 14 తర్వాత మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించడంతో వలస కూలీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రవాణా సౌకర్యం లేక, కాలి నడకను నమ్ముకున్నవారిని ఆకలి కబళిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉన్నచోట ఉండలేక, సొంత గూటికి చేరుకోలేక వలస కూలీలు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు.ఈ రోజు నుంచి నిబంధనలు సడలింపుతో తమ సొంత ఊళ్లకు వెళ్లాలని చాలామంది వలస కూలీలు ఆశ పెట్టుకున్నారు. వారిని సొంత ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తారో లేక వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లుతారో వేచి చూడాలి.