దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. నిత్యవసర సరుకుల షాపులు మినహా అన్ని బంద్ అయ్యాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. లాక్డౌన్ పీరియాడ్లో ఒక్కొక్కరు ఒక్కో బాధ కన్పిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తలసీమియా వ్యాధిగ్రస్తుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. లాక్డౌన్ కారణంగా రక్తదాతలు ఇళ్లకు పరిమితమవడంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం దొరకని పరిస్థితి నెలకొంది. తలసీమియా వ్యాధిగ్రస్తులకు సకాలంలో మార్పిడి చేయకపోతే వారి ప్రాణాలుపోయే ప్రమాదం ఉంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించి రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిరంజీవి, హీరో శ్రీకాంత్, బెనర్జీ తదితరులు స్వయంగా రక్తదానం చేసి ఈ వీడియోను షేర్ చేశారు.
చిరంజీవి పిలుపునకు స్పందించి పలువురు రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ కూడా చిరంజీవి పిలుపుకు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘డన్ కేసీ గారు.. తప్పకుండా మేం తొందరగా రక్తదానం చేస్తాం’ అంటూ అల్లు శిరీష్ చిరంజీవి వీడియోను షేర్ చేస్తూ అన్నాడు. ఈ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ అల్లు శిరీష్ పై ఫైరవుతోన్నారు. చిరంజీవిని పట్టుకొని కేసీ గారంటావా? అంటూ తిట్టిపోస్తున్నారు. మెగాస్టార్ అని పిలువలేవా అంటూ మందలిస్తున్నారు. ఈ వివాదం ముదురుతుందని గ్రహించిన అల్లు శిరీష్ ఫ్యాన్స్ కు వివరణ ఇచ్చాడు.
విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!
తమ ఫ్యామిలీలో చిరంజీవి గారిని ‘కేసీ గారు.. లేదా కేసీ సార్’ అంటామని మెగా ఫ్యాన్స్ ను చల్లబరిచే ప్రయత్నం చేశాడు. అభిమానులకు నమస్కారం పెట్టి వివాదం పెద్దది కాకుండా చూసే ప్రయత్నం చేశాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ కొంత చల్లబడినప్పటికీ కొంతమంది మాత్రం ఒక్క హిట్టుకే అంత పొగరు పనికి రాదంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీకి.. అల్లు అర్జున్ ఫ్యామిలీకి దూరం పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాలు తెరపైకి రావడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని మెగాస్టార్ లైట్ తీసుకుంటున్న తెలుస్తోంది.