కేటీఆర్ నెక్స్ట్ సీఎం..! సూచనగా కెసిఆర్ ఏమిచేసాడంటే…

ఇప్పటివరకు తెరాసకి సంబంధించిన కీలక నిర్ణయాలన్ని సీఎం కెసిఆర్ తీసుకునేవాడు కానీ ఇక నుంచి ఆ బాధ్యత మంత్రి కేటీఆర్‌ తీసుకోనున్నారు. అందుకు సూచనగా త్వరలోనే జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల ఎంపికను కేటీఆర్‌ కి అప్పంగించారు కెసిఆర్. త్వరలోనే కేటీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ సన్నాహాలు కూడా చేస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో… రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ ఛాయిస్ ఇవ్వడం వెనుక రాజకీయ మతలబు చాలానే […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 1:15 pm
Follow us on

ఇప్పటివరకు తెరాసకి సంబంధించిన కీలక నిర్ణయాలన్ని సీఎం కెసిఆర్ తీసుకునేవాడు కానీ ఇక నుంచి ఆ బాధ్యత మంత్రి కేటీఆర్‌ తీసుకోనున్నారు. అందుకు సూచనగా త్వరలోనే జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల ఎంపికను కేటీఆర్‌ కి అప్పంగించారు కెసిఆర్.

త్వరలోనే కేటీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ సన్నాహాలు కూడా చేస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో… రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ ఛాయిస్ ఇవ్వడం వెనుక రాజకీయ మతలబు చాలానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గతంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల భాధ్యత, అంతకు ముందు హుజుర్ నగర్ ఉపఎన్నిక బాధ్యతలను కేటీఆర్ కి అప్పగించడం, వాటిల్లో తెరాస అఖండ మెజారిటీ సాధించడం వల్ల తెరాసలో కేటీఆర్ క్రెడిట్ అంతకంత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికని కూడా కేటీఆర్ కి అప్పగించడం వెనుక కూడా కెసిఆర్ ఆలోచన వేరే ఉందటున్నారు.

రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో పలువురు కేటీఆర్‌ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయన అపాయింట్మెంట్ కోసం సదరు అభ్యర్థులు పడిగాపులు కాస్తున్నారు. దింతో కేటీఆర్ ఇమేజ్, తెరాసలో మరింతగా పెరుగుతుంది. కెసిఆర్ వ్యూహం కూడా అదే అయ్యిఉండొచ్చు అనేది అనేకమంది అభిప్రాయం.