రాజధాని ప్రాంతంగా అమరావతి ప్రాధాన్యతను క్రమంగా కుదించుకొంటూ వస్తున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా అత్యంత ప్రధానమైన రాయలసీమతో అనుసంధానం కావించే అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి అమరావతిని తొలగించడానికి రంగం చేసింది.
భూసేకరణ భారంగా మారిందని, రహదారిని అమరావతి వరకూ తీసుకెళ్లలేమని, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే, అప్పుడది అనంతపురం-చిలుకలూరిపేట ఎక్స్‌ప్రె్‌సవే అవుతుంది.
మారిన అలైన్‌మెంట్ ఆధారంగా భూసేకరణకు సంబంధించి 3డీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. రాజధాని పరిరక్షణ పేరిట రైతాంగం ఉద్యమాన్ని కొనసాగిస్తూ దాన్ని తీవ్రదశకు తీసుకెళ్తున్న తరుణంలో, రహదారి ప్రాజెక్టులో అమరావతి అన్నదే లేకుండా ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం.
రాయలసీమను అమరావతికి అనుసంధానించాలని గత ప్రభుత్వం అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవేను ప్రతిపాదించింది. రాజధానిను దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది. రూ.25వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును డిజైన్ చే శారు. దీనికి సంబంధించిన రైట్ ఆఫ్ వే (ఆర్‌ఓడబ్ల్యూ)కు కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎంఓఆర్‌టీహెచ్) అనుమతిచ్చింది.
భూసేకరణ వ్యయంలో సగం కేంద్రం, మిగతాది రాష్ట్రం భరించేలా విధివిధానాలు ఖరారయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను ఎంఓఆర్‌టీహెచ్ ఆమోదించింది. రహదారి నిర్మాణ బాధ్యతలను ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించింది. భూ సేకరణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు రకాల నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
అనంతపురం-అమరావతి రహదారి ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా… గుంటూరు జిల్లాలో భూసేకరణ కష్టంగా ఉందని, ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని అధికారులు నివేదించారు. దీంతో అలైన్‌మెంట్ మార్చాలని, చిలకలూరిపేట వరకే రహదారి అనుసంధానం చేయాలని, ఆపై వద్దని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది.
చిలకలూరిపేట మీదుగా ఎన్‌హెచ్-16 వెళ్తోంది. ప్రతిపాదిత ఎక్స్‌ప్రె్‌సవేను అక్కడ నిర్మిస్తున్న బైపా్‌సకు కలుపాలని ఆదేశించారు. అక్కడినుంచి గుంటూరు, విజయవాడకు హైవే ఉంది కాబట్టి, దానికి సమాంతంగా మరో పెద్ద రహదారి నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినట్లు తెలిసింది.
అనంతపురం ఎక్స్‌ప్రె్‌సవేను చిలకలూరిపేట బైపా్‌సకు కలిపితే, సీమ నుంచి వచ్చే వాహనాలు అక్కడినుంచి నేరుగా ఎన్‌హెచ్ 16 ద్వారా విశాఖ వెళ్లవచ్చన్న అంశంపైనా చర్చ సాగినట్లు తె లిసింది. కేంద్రం ఆమోదించిన ఆర్‌ఓడబ్ల్యూ ప్ర కారం అనంతపురం జిల్లా మర్రూరు నుంచి చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల నుంచి తాడికొండ మండలం పెద్దపరిమి దాకా రహదారిని ప్రతిపాదించారు.