
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి మూడు కీలక అంశాలలో చుక్కెదురైంది. ఒకటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విషయం కాగా మిగిలిన రెండు జగన్ తొందరపాటుతో తీసుకున్న అంశాలు.
పేదలకు 25లక్షల ఇండ్లను మంజురు చేసే విషయంలో జగన్ సర్కార్ కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకొంది. అమరావతి రైతుల భూములు, విశాఖ భూములను అక్రట్మంగా లాక్కున్నారనే అప్రతిష్ట జగన్ ప్రభుత్వానికి వచ్చింది. ఇదే అంశం పై హైకోర్టు పిటిషనలు దాఖలు అయ్యాయి. ఇళ్ల స్థలాల కోసం ఆరువేల ఎకరాల భూముని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.పాతిక లక్షల ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వీలు కల్పించే..”కన్వేయన్స్ డెడ్”లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇల్లు కట్టుకునే షరత్ లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
గ్రామ సచివాలయం గోడపై ఉన్న జాతీయ జెండాకి వైసీపీ జెండా రంగులు వేయడం, గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జగన్ బొమ్మలను వేసిన అంశంపై ముప్పా వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో.. హైకోర్టు, జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడకూడా జగన్ సర్కార్ కి చుక్కెదురైంది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగులకు నేషనల్ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేస్తూ పిటిషన్ ని కొట్టివేసింది.
మూడో అంశంగా శాసన మండలి రద్దు విషయంలో జగన్ ప్రభుత్వానికి పార్లమెంట్ లో షాక్ తగిలింది. మండలి రద్దు కనీసం ప్రస్థావనికి రాకుండానే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి.
ఈ విధంగా జగన్ ప్రభుత్వానికి, పై మూడు అంశాలపై అటు సుప్రీంకోర్టులో ఇటు పార్లమెంటు లో షాక్ తగిలింది.