ప్రతి ఐదుగురిలో ఒకరు కరోనా ఆధీనంలో

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ఐదుగరిలో ఒకరు (20 శాతం మంది) కరోనా ఆధీనంలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. వైద్యులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించకుంటే వీరంతా కరోనా బారిన పడతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,78,679 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 16,500 మందికి పైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కాగా, ఇప్పటి వరకు 1,01,000 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారిక […]

Written By: Neelambaram, Updated On : March 24, 2020 6:30 pm
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ఐదుగరిలో ఒకరు (20 శాతం మంది) కరోనా ఆధీనంలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. వైద్యులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించకుంటే వీరంతా కరోనా బారిన పడతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,78,679 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 16,500 మందికి పైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కాగా, ఇప్పటి వరకు 1,01,000 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మొదటి లక్ష మందికి కరోనా సోకడానికి 67 రోజులు పట్టగా కేవలం నాలుగు రోజుల్లోనే మరో లక్ష మందిని కరోనా ఆవహించింది. దీంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అవసరమైతే 170 కోట్ల మందిని నిర్బంధంలోనే ఉంచాలని, వారిని బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.