Homeఆంధ్రప్రదేశ్‌స్టీఫెన్ ను ఆంధ్ర తీసుకురావటంలో జగన్ ప్లాన్ ఇదేనా..?

స్టీఫెన్ ను ఆంధ్ర తీసుకురావటంలో జగన్ ప్లాన్ ఇదేనా..?

స్టీఫెన్ రవీంద్ర తెలంగాణాకి చెందిన ఒక ఐపీఎస్ అధికారి, కానీ ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ఇతని గురించే చర్చ. అసలు ఎవరు ఈ స్టీఫెన్ రవీంద్ర, ఎందుకు ఇతని పేరు ఆంధ్ర అంతా మారుమోగుతోంది.

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్టీఫెన్ రవీంద్రని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించాలనే ప్రతిపాదన చేసేంత వరకు ఎవరికీ ఇతని గురించి పెద్దగా తెలియలేదు.

రాష్ట్రంలో ఉన్న ఏ సీనియర్ ఐపీఎస్ అధికారినైన ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించే అధికారం జగన్ కి ఉంది. కానీ, పక్క రాష్ట్రంలో ఉన్న ఒక అధికారీనే ప్రత్యేకంగా కావాలని పట్టుబట్టటం వెనుక ఏదో మర్మం దాగి ఉందని అర్ధం అవుతుంది. ఈ విషయంపై జగన్ ప్రత్యేకంగా కెసిఆర్ ను కలిసి, స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపాల్సిందిగా కోరారు. ఒక రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ అధికారులను..అందులోనూ ఐజీ హోదాలో ఉన్న అధికారులను వేరే రాష్ట్రానికి తరలించే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీనికి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. దీని కోసం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాసారు..కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఒక రాష్ట్రానికి కేటాయించిన అధికారిని వేరే రాష్ట్రానికి పంపటానికి చట్టం ఒప్పుకోదు..ఏవైనా బలమైన కారణాలు ఉంటె తప్ప. ఉదా: ప్రాణహాని లాంటివి.

జగన్ మొన్న ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో ఈ విషయంమై చర్చించారంటూ..కథనాలు వచ్చాయి. జగన్ విన్నపానికి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారట. ఇంకేముంది స్టీఫెన్ రాకకు సర్వం సిద్ధం అయినట్లుగానే కనిపిస్తుంది.

స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకంగా కావాలి అనటానికి అతనికి ఉన్న ట్రాక్ రికార్డు కారణం అయ్యుండొచ్చు. స్టీఫెన్ రవీంద్ర 1999 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అధికారి. ఈయనకి 2005 లో పోలీస్ మెడల్ అఫ్ గాల్లంట్రీ, 2010 లో ప్రైమ్ మినిస్టర్ పోలీస్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్, 2016 లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ లాంటి ఉన్నతమైన అవార్డులు వచ్చాయి. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఏ అధికారి సేవలనైనా నాయకులు ఇష్టపడతారు. ఇవి అన్ని బయటికి కనిపించే అంశాలు కానీ ఎవరికీ తెలియని కొన్నికొత్త కోణాలు స్టీఫెన్ రవీంద్ర, జగన్ ల మధ్య ఉన్నాయి.

అవేంటంటే..

*స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ నిజాం కళాశాలలో చదువుకున్నాడు.

*మొదటిసారి వరంగల్ ఎస్పీ గా తన విధులు నిర్వహించాడు.

*దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి స్టీఫెన్ రవీంద్ర సెక్యూరిటీ ఇంచార్జ్ గా పని చేసారు. మార్చి 25, 2008 నుంచి జులై 30, 2009 దాకా..దాదాపు సంవత్సరం కంటే పైగా వై ఎస్ దగ్గర పని చేసారు.

*2019 లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) కు నేతృత్వం వహించారు.

ఇవి అన్ని మాములు విషయాలే..ఇందులో దాగి ఉన్న ఇంకో కోణం చూద్దాం..

*స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ నిజాం కళాశాలలో చదువుకున్నారు. అదే సమయంలో వై ఎస్ జగన్ కూడా నిజాం కళాశాలలో చదువుకున్నాడు. ఇద్దరి వయసు ఒకటే..అంటే విద్యా సంవత్సరం కూడా ఒకటే అవుతుంది. జగన్ కి అప్పటినుంచే స్టీఫెన్ రవీంద్ర పరిచయం అయ్యుండొచ్చు.

*మొదటిసారి వరంగల్ ఎస్పీ గా తన విధులు నిర్వహించాడు. అప్పుడు వరంగల్ రేంజ్ డిఐజీగా గౌతమ్ సావాన్గ్ తన విధులు నిర్వహిస్తున్నాడు. స్టీఫెన్ రవీంద్ర, గౌతమ్ సావాన్గ్ కింద విధులు నిర్వహిస్తూ..మెరుగైన శిక్షణ తీసుకున్నాడంట. వారి ఇద్దరి మంచి సాంగిత్యం ఉండి ఉండవచ్చు.

జగన్ కి స్టీఫెన్ రవీంద్ర నమ్మకస్థుడు గనుక 2019 లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసు విచారణను స్టీఫెన్ రవీంద్రకి అప్పగించాలిసిందిగా జగన్ కెసిఆర్ ను కోరి ఉండవచ్చు. అప్పటికే జగన్ కి కెసిఆర్ కి మంచి స్నేహం ఉండటం వాళ్ళ కెసిఆర్ కూడా స్టీఫెన్ కు కేసు బాధ్యతలు అప్పగించారు.

*జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండానే స్టీఫెన్ రవీంద్రను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించాలి అనుకున్నారంటే…పెద్ద పథకమే వేసినట్టుగా ఉంది కదా..రాష్ట్ర డీజీపీ గా గౌతమ్ సావాన్గ్ కి బాధ్యతలు ఇచ్చి, ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించి..గురు శిష్యులతో రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకోటానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొద్ది రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. మున్ముందు జగన్ వీరితో తన పధకం ఎలా నెరవేరుస్తాడో వేచి చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version