https://oktelugu.com/

జగన్ ప్లస్ పాయింట్లే బాబుకు మైనస్ అవుతున్నాయే..?

సీఎం జగన్ 15 నెలల కాలంలో ఏపీకి ఏం చేశారు..? అనే ప్రశ్న ఎదురైతే జగన్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పెద్దగా ఏం చేయలేకపోయినా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పథకాల అమలు మాత్రం చేశారని ఏపీ ప్రజలు చెబుతూ ఉంటారు. కొందరు ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు వృథాగా పంచి పెడుతున్నారని కామెంట్లు చేసినా ఈ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్లు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 20, 2020 6:33 pm
    Follow us on

    chandrababu jagan

    సీఎం జగన్ 15 నెలల కాలంలో ఏపీకి ఏం చేశారు..? అనే ప్రశ్న ఎదురైతే జగన్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పెద్దగా ఏం చేయలేకపోయినా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పథకాల అమలు మాత్రం చేశారని ఏపీ ప్రజలు చెబుతూ ఉంటారు. కొందరు ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు వృథాగా పంచి పెడుతున్నారని కామెంట్లు చేసినా ఈ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్లు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు.

    Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం

    కరోనా కష్ట కాలంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్ సక్సెస్ అవుతోంటే 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఐదేళ్ల పాలనా కాలంలో అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఐదు విడతల్లో రుణమాఫీ చేశానని చెప్పిన చంద్రబాబు ఎన్నికలకు నెల రోజుల ముందు రుణమాఫీ నాలుగు, ఐదు విడతల నగదు విడుదల చేసినట్టు పత్రికల్లో, మీడియాలో వార్తలు వచ్చినా ఆ వార్త నిజం కాలేదు.

    అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం పథకాల అమలు విషయంలో వెనక్కు తగ్గడం లేదు. మరోవైపు జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజల్లో సానుకూలత ఉంది. చంద్రబాబు కూడా జగన్ లా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాకుండా అభివృద్ధి చెందిన జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేసి ఉంటే అసలు రాజధాని సమస్యే వచ్చి ఉండేది కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

    మరోవైపు జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేస్తూ ప్రయోజనం పొందాలని టీడీపీ భావిస్తున్నా అభివృద్ధికి చంద్రబాబు అడ్డు పడుతున్నారని ప్రజల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అనుకూల మీడియా జగన్ పై ఎంత దుష్ప్రచారం చేస్తున్నా ప్రజామద్దతు కూడగట్టుకోవడంలో జగన్ సక్సెస్ అవుతూ ఉండటంతో భవిష్యత్తులో వైసీపీ మరింత బలపడుతుందని టీడీపీ మాత్రం బలపడటం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Also Read : టిక్ టాక్ కు ఊరట.. నిషేధం ఎత్తేసిన ట్రంప్