Homeఆంధ్రప్రదేశ్‌వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ కు షాక్..

వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ కు షాక్..

మాజీ మంత్రి వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దానితో సిబిఐ దర్యాప్తు జరుగకుండా తీవ్రంగా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిన్నట్లు అయింది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత పిటిషన్లను కోర్టు విచారించింది. మొత్తం నాలుగు పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హత్య జరిగి ఏడాది అవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

కాగా, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ దరీఫతు కోర్టు కోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిటిషన్‌ ఉపసంహరించుకున్న ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. కడప జిల్లాలోని పులివెందుల నుంచి దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది.

ఏడాది పాటు సిట్‌ విచారణ జరిపినా ఏమీ తేల్చలేకపోయిందని కోర్టు పేర్కొంది. కేసులో అంతర్‌రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం విదితమే.

జగన్ ప్రభుత్వం పలుసార్లు దర్యాప్తు చేస్తున్న అధికారులు మారుస్తూ రావడంతో స్వయంగా వివేకానంద రెడ్డి భార్య, కుమార్తె దర్యాప్తు జరుగుతున్న తీరుపట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి రాజశేఖరరెడ్డి స్వయంగా తమ్ముడు. గతంలో కడప ఎంపీగా, పులివెందుల ఎమ్యెల్యేగా పనిచేశారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version