https://oktelugu.com/

వసంతకాలానికి గూగుల్ డూడుల్ స్వాగతం

రేపు మార్చి 20, 2020 శుక్రవారం ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గూగుల్ ఈ రోజు (గురువారం) తన ప్రముఖ డూడుల్‌ తో వసంతకాలానికి స్వాగతం పలికింది. మనోహరమైన పారాచూట్ మరియు స్పష్టమైన నీలి ఆకాశాన్ని కలిగి ఉన్న డూడుల్ స్ప్రింగ్ యొక్క చక్కని ఇమేజ్ తో కొత్త కాలాన్ని ఆహ్వానించింది. అయితే వసంతకాలం గురువారం (మార్చి 19) సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది, కానీ మర్చి 20 నుంచి లెక్కిస్తారు. సంవత్సరంలో నాలుగు సమశీతోష్ణ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 19, 2020 / 10:17 AM IST
    Follow us on

    రేపు మార్చి 20, 2020 శుక్రవారం ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గూగుల్ ఈ రోజు (గురువారం) తన ప్రముఖ డూడుల్‌ తో వసంతకాలానికి స్వాగతం పలికింది. మనోహరమైన పారాచూట్ మరియు స్పష్టమైన నీలి ఆకాశాన్ని కలిగి ఉన్న డూడుల్ స్ప్రింగ్ యొక్క చక్కని ఇమేజ్ తో కొత్త కాలాన్ని ఆహ్వానించింది. అయితే వసంతకాలం గురువారం (మార్చి 19) సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది, కానీ మర్చి 20 నుంచి లెక్కిస్తారు.

    సంవత్సరంలో నాలుగు సమశీతోష్ణ సీజన్లలో వసంతకాలం ఒకటి. శీతాకాలం తరువాత మరియు వేసవికి ముందు వచ్చే ఈ వసంతకాలాన్ని చాలా మంది ప్రజలు వేసవి కాలం మధ్య కాలం అని పిలుస్తారు. ఉత్తర అర్ధగోళంలో మార్చి 20 న మరియు దక్షిణ అర్ధగోళంలో సెప్టెంబర్ 22న వసంతకాలం ప్రారంభమౌతుంది.

    సాధారణంగా ఉత్తర అర్ధగోళంలో వసంతంకాలం మార్చి 21 నుండి జూన్ 21 వరకు ఉంటుంది, దక్షిణ అర్ధగోళంలో ఇది సెప్టెంబర్ 21 నుండి డిసెంబర్ 21 వరకు ఉంటుంది. వాతావరణ మార్పులను బట్టి సంవత్సరంలో ఈ తేదీలు కొద్దిగా మారవచ్చు. వసంతకాలం ప్రారంభం రోజున పగలు, రాత్రి సమంగా ఉంటాయి. భూమధ్యరేఖ సూర్యునికి దగ్గరగా లేదా దూరంగా రావడం వల్ల ఉత్తర అర్ధగోళంలో జూన్ 21న, దక్షిణ అర్ధగోళంలో, డిసెంబర్ 21న ఈ వసంతకాలం రెండు సార్లు ముగుస్తోంది.

    వసంతకాలంలో ఇగిరిన సంతోషాలు మళ్ళీ చిగురించేలా చెట్లు వికసిస్తాయి, కొంగొత్త ఆలోచనలతో జంతువులు మేల్కొంటాయి మరియు భూమి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతూ.. ఎండా కాలానికి తీసుకెళ్తాయి.