లాక్ డౌన్ ముందు గొయ్యి తర్వాత నుయ్యి!

ఈ నెల 31కి లాక్ డౌన్ కాలపరిమితి ముగుస్తుండడంతో పొడిగింపుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. లాక్ డౌన్ పొడిగింపు మంచిదా? కాదా? అన్నదానిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ను పోడిగింపు మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సిసిఎంబి) సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘కొత్త కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గంటగంటకూ పాజిటివ్ […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 5:29 pm
Follow us on

ఈ నెల 31కి లాక్ డౌన్ కాలపరిమితి ముగుస్తుండడంతో పొడిగింపుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. లాక్ డౌన్ పొడిగింపు మంచిదా? కాదా? అన్నదానిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ను పోడిగింపు మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సిసిఎంబి) సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘కొత్త కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గంటగంటకూ పాజిటివ్ కేసులు, మరణాలూ పెరిగిపోతున్నాయి.. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే జూన్‌ చివరినాటికి ఇండియాలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం లక్షా 38వేల కేసులు ఉండగా… జూన్ చివరి నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుతుందని సిసిఎంబి చెబుతోంది.

మరోవైపు ఇక లాక్ డౌన్ పొడిగిస్తే.. ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైద్యపరంగా మరో సంక్షోభం కూడా తలెత్తుతుందని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ ప్రతికూల ప్రభావాలు, కోవిడ్‌ యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని పేర్కొన్నారు.

ఈ విధంగా లాక్ డౌన్ ‘ముందు గొయ్యి వెనుక నుయ్యి’ అనే పరిస్థితిలో పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరిలో ఆసక్తి నెలకొన్నది.