https://oktelugu.com/

కరోనా ఖర్చు ఎంతో తెలుసా ?

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశంలోనూ విజృంభిస్తోంది. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య రెండొందల అరవై మందికి చేరింది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానితుల సంఖ్య ఇప్పటికే 23 మందికి చేరింది ఇంకా వేల మందికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. చేస్తున్నారు కూడా ..కరోనా ప్రపంచ విపత్తు గనుక కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా అనుమానితులకు ఉచితంగానే వైద్య పరీక్షలు చేస్తున్నాయి.ఇదంతా ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకొన్న విషయం […]

Written By: , Updated On : March 21, 2020 / 10:42 AM IST
Follow us on

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశంలోనూ విజృంభిస్తోంది. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య రెండొందల అరవై మందికి చేరింది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానితుల సంఖ్య ఇప్పటికే 23 మందికి చేరింది ఇంకా వేల మందికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. చేస్తున్నారు కూడా ..కరోనా ప్రపంచ విపత్తు గనుక కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా అనుమానితులకు ఉచితంగానే వైద్య పరీక్షలు చేస్తున్నాయి.ఇదంతా ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకొన్న విషయం అయినా ఎంతో ఓపికతో చేస్తోంది.ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు ఒక్కో వ్యక్తి ఫై సుమారు రూ. 4500 నుంచి 5000 వరకు మన ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి.

భారత వైద్య పరిశోధన మండలి (ఐ సి ఎం ఆర్ ) ప్రకారం కరోనా వైరస్ ప్రాథమిక పరీక్షకు రూ. 1500 ఖర్చు అవుతుండగా అనంతరం జరిగే నిర్ధారణ పరీక్షకు రూ. 3500 ఖర్చు అవుతాయి.

ఇక కరోనా పరీక్షలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిమనం కలిగి ఉండక పోవడంతో మన దేశంలోని ల్యాబ్ లు జర్మనీ, అమెరికా నుంచి వాటిని దిగుమతి చేసుకుంటున్నాయని తెలుస్తోంది . … మన దేశ వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్ ల నెట్ వర్క్ నిర్వహిస్తున్న ‘ట్రివిట్రాన్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్’ సంస్థ చైర్మన్ జీ .ఎస్. కె. వేలు తెలిపారు. అందుకే మన దగ్గర ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ. ఐదు వేల వరకూ ఖర్చు అవుతోందని చెప్పారు. అయితే, ఈ పరిజ్ఞానాన్ని మన దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే కరోనా పరీక్ష ఖర్చు రూ. 500లకు మించబోదన్నారు.

దేశంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ అసుపత్రులు, ప్రభుత్వ ల్యాబ్ లు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఇక పై ప్రైవేటు అసుపత్రులు కూడా ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి పిలుపునిచ్చింది. అయితే, దేశంలో వందలోపు ప్రైవేటు ల్యాబ్ లకు మాత్రమే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఇది ఒకింత భయాన్ని కలిగించే విషయమే …