https://oktelugu.com/

కేసీఆర్ సర్కార్ కి ‘పెసరపప్పు’ ఆదేశం!

పాతకాలం నుండి ఒక సామెత బాగా ఫేమస్ అయింది, ఏమిటంటే…”అసలు లేదురా మొగుడా.. అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట” ఈ రోజు హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు ఇలానే ఉన్నాయి. రాష్ట్రంలో అధికసంఖ్యలో టెస్టులు చేసి, వైరస్ సోకిన వారిని ఐసోలాషన్ లో ఉంచాల్సిన పనినే కేసీఆర్ సర్కార్ సరిగా చేయడం లేదు. అలాంటిది మృతదేహాలకి కూడా కరోనా టెస్టులు చేయమనడం ఎంత వరకు సబాబో హైకోర్టు న్యాయవాదులకే తెలియాలి. ఇంతకీ విషయం ఏమిటంటే… […]

Written By: , Updated On : May 14, 2020 / 07:42 PM IST
Follow us on

పాతకాలం నుండి ఒక సామెత బాగా ఫేమస్ అయింది, ఏమిటంటే…”అసలు లేదురా మొగుడా.. అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట” ఈ రోజు హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు ఇలానే ఉన్నాయి. రాష్ట్రంలో అధికసంఖ్యలో టెస్టులు చేసి, వైరస్ సోకిన వారిని ఐసోలాషన్ లో ఉంచాల్సిన పనినే కేసీఆర్ సర్కార్ సరిగా చేయడం లేదు. అలాంటిది మృతదేహాలకి కూడా కరోనా టెస్టులు చేయమనడం ఎంత వరకు సబాబో హైకోర్టు న్యాయవాదులకే తెలియాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే… తెలంగాణలో చనిపోయిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే… కరోనా 3వ స్టేజికి వెళ్లే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు. వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని వాదించారు. దీంతో మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఈ నెల 26న నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.

ఈ విషయం పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న జగన్ సర్కార్ ప్రతిఇంటిలో ఒకరికి కరోనా టెస్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అందుకు తగినట్లుగానే ఏపీ అధికారులు అడుగులు వేస్తున్నారు. కానీ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడం, అప్పటినుండి రోజు రోజుకి కోవిద్ టెస్టులు భారీ స్థాయిలో తగ్గించారు. మరణాల సంఖ్య కూడా తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం దీనికి తోడు మృత దేహాలకి కూడా టెస్టులు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.