భారీ ప్యాకేజీలో రైతుల వాటా..

కరోనా కాలంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ లో వ్యవసాయం, రైతులకు కొరకు చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నాం. సన్న కారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 6:56 pm
Follow us on

కరోనా కాలంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ లో వ్యవసాయం, రైతులకు కొరకు చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నాం. సన్న కారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కిసాన్‌ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు  రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరుచేశాం. ఈ రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పిస్తున్నాం. రైతులకు 25లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేశాం. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో రూ. 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసింది. ఇంతటితో వ్యవసాయరంగానికి సాయం ముగిసినట్టు కాదు’’ అని వివరించారు.

ఇప్పటికే రూ 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఆమోదించామని తెలిపారు. పాతిక లక్షల మంది నూతన కిసాన్‌ కార్డు దారులకు రూ 25,000 కోట్ల రుణం అందచేస్తామని తెలిపారు.