కరోన వల్ల కొంత మేలు జరిగిందా..?

  ప్రజలను వణికిస్తోన్న కరోన వైరస్ వల్ల ఎంతో కొంత అటు ప్రకృతికి ఇటు మనుషులకు మేలు చేస్తోందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. కరోన వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే జల, వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించింది. ఎప్పుడూ బిజీ బిజీగా యంత్రాల్లాగా తయారైన మనుషులను మళ్లీ మామూలు మనుషులుగా తయారుచేసింది . ఉద్యోగాలు, వ్యాపారం పేరుతో కుటుంబానికి దూరంగా సభ్యులందరినీ ఒక్క చోటికి చేర్చి కుటుంబ విలువలను పెంచింది. బయటి తిండి కి అలవాటు పడిన […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 4:36 pm
Follow us on

 

ప్రజలను వణికిస్తోన్న కరోన వైరస్ వల్ల ఎంతో కొంత అటు ప్రకృతికి ఇటు మనుషులకు మేలు చేస్తోందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

కరోన వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

జల, వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించింది.

ఎప్పుడూ బిజీ బిజీగా యంత్రాల్లాగా తయారైన మనుషులను మళ్లీ మామూలు మనుషులుగా తయారుచేసింది .

ఉద్యోగాలు, వ్యాపారం పేరుతో కుటుంబానికి దూరంగా సభ్యులందరినీ ఒక్క చోటికి చేర్చి కుటుంబ విలువలను పెంచింది.

బయటి తిండి కి అలవాటు పడిన మనిషికి ఇంటి రుచి ని మళ్ళీ చూపించింది

నూడిల్స్ గోబీ ల బారి నుండి పిల్లలను కాపాడి అమ్మ ముద్దను అలవాటు చేసింది.

ఆచార,బాహ్య భక్తికి బదులు,ఆత్మ భక్తిని నేర్పించింది .

మనిషికి అవసరమైన పరిశుభ్రతను నేర్పించింది .

గుంపు భక్తికి అలవాటుపడిన మనుషులకు ఏకాంత భక్తి యొక్క అవసరతను నేర్పించింది.

కొత్త కొత్త రుచులకు అలవాటుపడ్డ నాలుకను ఇంటి రుచికి అలవాటు చేసింది.

ఎప్పుడో వెనుకపడ్డ భారతీయ సనాతన ధర్మం “నమస్తే” మళ్ళీ తెరపైకి వచ్చింది.