ఎన్పీఆర్ కి లైన్ క్లియరైనట్లుగా తెలుస్తుంది. ఈ జాతీయ జనాభా గణన ప్రక్రియ ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ భారతదేశ ప్రప్రథమ పౌరుడు రాష్ట్రపతి నుండి మొదలౌతుంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి, కేంద్ర కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ విధంగా..కొనసాగనుంది. ఎన్పీఆర్ మాన్యువల్, డ్రాఫ్ట్ ఫామ్ లను ఖరారు చేస్తున్నారని, ఫారాల ముద్రణ మార్చి రెండో వారం నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
ఎన్పీఆర్ అమలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రతిపక్షాలు, విపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ అమలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్ వంటి పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ ఎన్పీఆర్ అప్ డేట్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలకోసం ప్రజలంతా ఇందులో మనస్ఫూర్తిగా పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Caa npr process starts from april 1st
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com