https://oktelugu.com/

అడ్డేడ్డే.. నోటికాడ చుక్కని లాగేశారు!

లాక్‌ డౌన్ 3.0 మార్గదర్శకాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైన్ షాప్‌ లు తెరచుకున్నాయి. ఏపీలో వైన్ షాప్‌ ల ఓపెన్ కి అనుమతులు ఉన్నాయి. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మద్యం షాపులు ఓపెన్ కి అనుమతులు ఇవ్వలేదు. దింతో పెద్ద సంఖ్యలో ఆయా రాష్ట్రాల ప్రజలు ఏపీకి వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలకు అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 4, 2020 / 05:01 PM IST
    Follow us on

    లాక్‌ డౌన్ 3.0 మార్గదర్శకాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైన్ షాప్‌ లు తెరచుకున్నాయి. ఏపీలో వైన్ షాప్‌ ల ఓపెన్ కి అనుమతులు ఉన్నాయి. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మద్యం షాపులు ఓపెన్ కి అనుమతులు ఇవ్వలేదు. దింతో పెద్ద సంఖ్యలో ఆయా రాష్ట్రాల ప్రజలు ఏపీకి వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలకు అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. అదే విధంగా దాదాపు 40 రోజుల తర్వాత షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు క్యూకట్టారు. మద్యం ప్రియుల రద్దీతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

    అదే సమయంలో తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు మాత్రం లాక్‌ డౌన్‌ ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు. పక్కనే ఉన్న ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభమవడంతో.. తమిళనాడు, తెలంగాణ సరిహద్దులోని ప్రజలు అక్కడికి క్యూ కడుతున్నారు. చిత్తూరుకు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున మందుబాబులు తరలివస్తున్నారు.

    చిత్తూరు జిల్లా పాలసముద్రం తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. అక్కడ మద్యం దుకాణం తెరచుకోవడంతో జిల్లా సరిహద్దులోని తమిళనాడు ప్రాంత వాసులు మద్యం కొనుగోలు తరలివచ్చారు. వైన్ షాప్ ముందు స్థానికులతో పాటు తమిళనాడు వాసులు కూడా క్యూకట్టారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని తమిళనాడు తహసీల్దార్లు ఏపీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో చిత్తూరు జిల్లా అధికారులు పాలసముద్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఐతే మందుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్థానిక మద్యం ప్రియులు చిత్తూరు జిల్లా యంత్రాంగం నిర్ణయాన్ని తప్పుబట్టుతున్నారు. తమిళనాడు నుంచి రాకుండా చర్యలు తీసుకోవాలని గానీ.. మా నోటి దగ్గరి చుక్కని లాక్కోవడమెంటని మందుబాబులు వాపోతున్నారు.