
కొన్ని రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు….అవేంటంటే.. జగన్ పరిపాలన బాగా అందిస్తే వెళ్లి సినిమాలు చేసుకుంట అన్నారు. ఆలా అన్నారో లేదో నిన్న ఉదయం కొత్త సినిమా షూటింగులో ప్రత్యక్షమయ్యారు. పవన్ ఎప్పటినుంచో ఈ సినిమా చేస్తునట్టు ఊహాగానాలు వినిపించాయి. వాటి అన్నిటిని నిజం చేస్తూ నిన్న సినిమా షూటింగులో పాల్గొన్నారు.
దానికి ఇప్పుడు నెటిజన్లు మరియు ప్రత్యర్థి పార్టీ వాళ్లు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ పాలనా నచ్చిందేమో… అన్నట్టే పవన్ మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు అని తెగ ట్రోల్ చేస్తున్నారు.
నిజమే కదా మరి…పవన్ అన్న మాటలు సరిగ్గా సరిపోయాయి కదా. పాలనా బాగుంటే తిరిగి సినిమాలు చేసుకుంటా అన్నారు… ఇప్పుడు సినిమా చేస్తున్నారు అంటే పాలనా బాగున్నట్టే అర్ధం కదా. మరి జగన్ పాలనా పవన్ ని సంతృప్తి పరిచిందేమో….ఎవరికి తెలుసు మన పవర్ స్టార్ ఎవరికీ అర్ధం కాడు మరి…!