
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెరాసతో ఎంతో కొంత మంచిగానే ఉంటూనే మరో వైపు చురకలు అంటిచారు. బీఎస్- ఎంజీబీఎస్ మధ్య హైదరాబాద్ మెట్రో మార్గాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 7న (రేపు) ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇదే విషయాన్ని హైదరాబాద్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ కెసిఆర్ కి చురకంటిచారు.
“జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు నిర్మాణం ఓకే.. మరి ఫలక్ నుమా సంగతేంటి అని, దక్షిణ హైదరాబాద్ విషయానికొచ్చేసరికి మీ దగ్గర నిధులు ఉండవు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు”
Amazing that you have funds for JBS & MGBS,when will @hmrgov start and complete MGBS to FALAKNUMA ? https://t.co/FnCyy8Y829
— Asaduddin Owaisi (@asadowaisi) February 6, 2020
నిజానికి మూడో దశ మెట్రో రైలు జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గం పూర్తయ్యింది. ‘దార్ ఉల్ ఫిషా’ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.