
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత కొంత కాలంగా వేడెక్కాయి దానికి ప్రధాన కారణం టీడీపీ నేతలు, ఒక్కొక్కరుగా వైసీపీలోకి చేరడమే అందులో భాగంగానే గన్నవరం మాజీ టీడీపీ నేత వల్లభనేని వంశీ విచిత్రమైన కామెంట్స్ చేశారు. టీడీపీ నేతగా చలామణి అయినప్పుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అందులో ఒకటేమిటంటే.. “కడుపుకు అన్నం తినే వాడుడెవడు వైసీపీలో ఉండడు” అని, మరి నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాత్రం నేను త్వరలోనే వైసీపీలో చేరుతానని అన్నారు. అంటే దీనర్థం ఏమిటి? వంశీగారు.. మీరు కడుపుకు అన్నం తినడం లేదనేగా..!?” అని ప్రజలు అడుగుతున్నారు. చెప్పింది తక్కువ.. ఈ వీడియో ఒక్కసారి చూడండి… చెప్పాల్సింది చాలా ఉందంటారు!
మీలాంటి ఎంతోమంది నాయకులను తయారుచేసింది తెలుగుదేశం. ఒక్క ఆకు రాలినంత మాత్రాన ఆ మహా వృక్షానికేమవుతుంది? pic.twitter.com/0j8NddL1BD
— Telugu Desam Party (@JaiTDP) November 15, 2019