Homeఎంటర్టైన్మెంట్ఈ సినిమాని చూడడం కంటే ట్రైలర్ ని మరోసారి చూస్తే సరిపోతుంది!

ఈ సినిమాని చూడడం కంటే ట్రైలర్ ని మరోసారి చూస్తే సరిపోతుంది!

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పుడు… ఇంకేముంది వర్మ అసలే మామూలోడు కాదు, ఇలాంటి టైటిల్ తో సినిమా తీస్తున్నాడంటే మనకి తెలియని రాజకీయ రహస్యాలేవో ఈ సినిమాలో ఖచ్చితంగా చూపిస్తాడని అని అనుకొని వుంటారు సినిమా ప్రేక్షకులు మరియు రామ్ గోపాల్ వర్మ అభిమానులు. తర్వాత కొన్ని రోజులకు ఫస్ట్ లుక్ పోస్టర్ లు , ట్రైలర్ లు చూసి ఇంకేముంది ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులను అందరిని పిచ్చపిచ్చాగా […]

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పుడు… ఇంకేముంది వర్మ అసలే మామూలోడు కాదు, ఇలాంటి టైటిల్ తో సినిమా తీస్తున్నాడంటే మనకి తెలియని రాజకీయ రహస్యాలేవో ఈ సినిమాలో ఖచ్చితంగా చూపిస్తాడని అని అనుకొని వుంటారు సినిమా ప్రేక్షకులు మరియు రామ్ గోపాల్ వర్మ అభిమానులు. తర్వాత కొన్ని రోజులకు ఫస్ట్ లుక్ పోస్టర్ లు , ట్రైలర్ లు చూసి ఇంకేముంది ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులను అందరిని పిచ్చపిచ్చాగా ట్రోల్ చేసేసాడు వర్మ , ట్రయిలర్ ఇలా ఉంటె మరి అసలు సినిమాలో ఇంకేమి చూపిస్తాడో అనుకున్నారు సగటు ప్రేక్షకులు. ట్రయిలర్ తర్వాత వచ్చిన టాక్ తో ఈ చిత్రంపై ఎన్నో విమర్శలు , పోలీస్ కేసులు మరియు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై పెద్ద రాద్ధాంతం జరిగి చివరికి హై-కోర్ట్ వరకు వెళ్లి ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ గా మార్చారు.

అసలు విషయమేమిటంటే. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా అసలు రామ్ గోపాల్ వర్మ కి అయినా అర్దమయ్యిందా? లేదా వూరికే కాలక్షేపానికి తీసాడా అనే సందేహం కలగక మానదు. ఈ చిత్రంలో నటించిన 3-4 క్యారెక్టర్స్ తప్ప అది కూడా వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ కి కొంచెం దగ్గరగా ఫీల్ అయ్యేలా నటించడం మినహా ఈ సినిమాలో చూడడానికి ఏమి లేదు. అసలు ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడం అనవసరం. సినిమా చూడడం కంటే ట్రైలర్ ని మరోసారి చూడడం బెటర్.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper