Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేసి.. అందుకు తగ్గ హైప్‌ను పెంచారు మేకర్స్.