Yogi Adityanath : యూపీలో 2024 సంవత్సరంలో సాధించిన ప్రగతిని తెలుసుకుందాం.. 25 కోట్ల జనాభా ఉన్న యూపీ అభివృద్ధి కాకపోతే దేశం అభివృద్ధి కాదు. యూపీకి బీమారు రాష్ట్రంగా పేరుపడింది. దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో రెండోది. బీహార్ మొదటిది.. రెండోది ఉత్తరప్రదేశ్. కాబట్టి ఈ రాష్ట్రాల ప్రగతిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
2017లో యోగి సీఎం అయ్యాక ఎంతో అభివృద్ధి చేశారు. ఇవ్వాళ ఆధ్యాత్మిక రాజధానిగా ప్రపంచానికి పేరు పొందుతోంది. ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకుందాం.
యోగి సీఎం అయ్యాక.. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని నిర్ణయించాడు.ఆ పథకంలో భాగంగా 2024లో 16 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. 1650 మెడికల్ సీట్లు వచ్చాయి. 2024లో 6 యూనివర్సిటీలను ప్రారంభించాడు. వెనకబడిన బుందేల్ ఖండ్ లో కొత్త నగరాన్ని 35వేల ఎకరాల్లో నిర్మిస్తున్నాడు. లక్నో నగరం చుట్టూ ఓఆర్ఆర్ ఏర్పాటు చేశారు. 6 ఎయిర్ పోర్టులు కొత్తగా వచ్చాయి. 10 లక్షల కోట్ల పెట్టుబడులతో శంకుస్థాపనలు జరిగాయి..
2024లో యోగి సాధించిన విజయాలు 2025లో లక్ష్యాలు వివరంగా.. ‘రామ్’ గారి విశ్లేషణలో తెలుసుకుందాం..