Keerthy Suresh : స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరో రామ్ కు జంటగా నేను శైలజ అని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది ఈ అమ్మడు. మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. నేను శైలజ సినిమాలో తన క్యూట్ క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది కీర్తి సురేష్. 2015 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. దాంతో ఈమెకు టాలీవుడ్ లో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తి సురేష్ 2000 సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2013లో మలయాళం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కీర్తి సురేష్ ఇప్పటివరకు తన కెరీర్లో తెలుగుతోపాటు మలయాళం, తమిళ్ లో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇక తెలుగులో కీర్తి సురేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో మహానటి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోయిన్ సావిత్రి బయోపిక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే మహానటి సినిమా ఆఫర్ తనకు వచ్చిన సమయంలో కీర్తి సురేష్ ఈ సినిమాను నిరాకరించినట్లు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దర్శకుడు నాగ్ ముందుగా నాకు ఈ కథను వినిపించినప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి నిరాకరించాను. నిర్మాతలు సైతం నేను ఈ సినిమా చేస్తానని ఉత్సాహంగా ఉన్నారు. కానీ నేను భయపడి ఈ సినిమా చేయడానికి నిరాకరించాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
స్వప్న, ప్రియాంక ఆశ్చర్యపోయి ఈమె ఏంటి సావిత్రి అమ్మ బయోపిక్ చేయడానికి నిరాకరించిన అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ నేను భయపడి ఈ ప్రాజెక్టును నిరాకరించినట్లు ఆమె తెలిపింది. ఈ అమ్మాయి ఏమిటి ఎక్కడి నుంచో వచ్చి ఆకస్మాత్తుగా ఒక లెజెండ్ పై బయోపిక్ తీస్తుంది.. ఇక నేను దానిని నాశనం చేశానని చెప్తే ఎలా.. నేను దాని గురించి సానుకూలంగా ఆలోచించ లేకపోయాను. అందుకే నేను ఈ సినిమా చేసేందుకు చాలా భయపడ్డాను అంటూ కీర్తి సురేష్ తెలిపింది. ఈ సినిమాలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని చూపించాలని అనుకున్నాము. కానీ అది అభిమానులకు నచ్చకపోతే లేదా తప్పుడు మార్గంలో తీసుకొని వెళితే ఎలా అంటూ ఆలోచించాను.
కానీ నా మీద నాకు ఉన్న నమ్మకం కన్నా దర్శకుడు నాగ్ అశ్విన్ కి నా మీద ఉన్న సినిమా చేసేలా ప్రేరేపించింది. తమిళ్ లో తన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలు తనను దురదృష్టవంతురాలిగా భావించారంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో తెలిపింది.సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కు జోడిగా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.