యూపీ సీఎం యోగి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. రాజకీయాల్లో ఓ కొత్త ప్రయోగం యోగి. రావడంతోనే మాఫియా ముఠాలను ఎన్ కౌంటర్లను చేసి హతమార్చాడు. తప్పులు చేసిన వారి ఆస్తులను బుల్డోజర్లతో పడగొట్టించి బుల్డోజర్ బాబా అయ్యాడు. యూపీలో ఎక్స్ ప్రెస్ హైవేలు ఏర్పాటు చేసి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఆర్థిక రంగంలో చాలా చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చాడు. దేశమంతా యూపీ ఫార్ములా ఫాలో అవుతోంది.
ఇప్పుడు కొత్తగా పర్యావరణం మీద దృష్టి సారించాడు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నో చిన్న నదులు నీరు పారడం ఆగిపోయింది. స్తంభించిపోయింది. లక్నో నగరంలో ‘గౌమతి’ రివర్ అది మురికి నదిలా తయారైంది. గాజియాబాద్ లో ‘కిండన్’ , కాశీలో వరుణ నది ఇలానే స్తంభించిపోయింది.
జలావ్ అనే జిల్లాలో 18 గ్రామాలు కలిసి ఓ నదిని పునరుజ్జీవం చేసుకోగలిగారు. నేపాల్ శ్రావస్తి దగ్గర ఇలానే మరో నదిని పునరుజ్జీవం చేసుకోగలిగారు. తెలంగాణలో మిషన్ కాకతీయలో చెరువులను పునరుద్దరించారు. అలాంటిదే యూపీలో ఇప్పుడు బృహత్ ప్రణాళిక వేశారు. 75 నదులు కలిపేలా కార్యరూపం దాల్చేలా ప్రణాళికలు చేశారు. దీని కోసం ఉపాధి పథకం నిధులతో 75 చిన్న నదులను పునరుజ్జీవం చేయాలని ప్లాన్ చేశారు.
ఉపాధి పథకం నిధులతో 75 చిన్న నదులకు పునరుజ్జీవం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
