https://oktelugu.com/

Mood of the Nation : కాంగ్రెస్ కి పెరిగే ఓట్లు మిత్ర పక్షాల నుంచే

కాంగ్రెస్ కి పెరిగే ఓట్లు మిత్ర పక్షాల నుంచే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు..

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2024 / 07:54 PM IST

    Mood of the Nation : నిన్న ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు వచ్చాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ సర్వేలు చేస్తోంది. 6 నెలలకు ఒకసారి చేస్తారు. వారిచ్చిన సర్వేల్లో బీజేపీకి లోక్ సభ లో వచ్చిన దానికంటే ఒక శాతం ఎక్కువ ఓటింగ్ పెరిగింది. రాహుల్ గాంధీకి 21 శాతం నుంచి 25 శాతానికి పెరిగాయి.

    పాపులారిటీ చూస్తే మోడీకి 49 శాతం.. రాహుల్ గాంధీకి 22 శాతం వచ్చింది. ఇంకా బీజేపీ కాంగ్రెస్ కు 13 శాతం గ్యాప్ ఉంది. అయితే కాంగ్రెస్ కు పెరిగిన నాలుగు శాతం కూడా దాని మిత్రపక్షాల నుంచే వచ్చింది.

    ప్రధానంగా కాంగ్రెస్ కు పెరిగిన ఓటు 4 శాతం అనేది చూస్తే.. రాహుల్ గాంధీకి పోటీగా ఉన్న మమత, కేజ్రీవాల్ ల ప్రభ తగ్గిపోయింది. అందుకే రాహుల్ కు గ్రాఫ్ పెరిగింది. ముస్లింలు దేశంలో కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవుతున్నారు.

    బాబ్రీ మసీదు తర్వాత కాంగ్రెస్ కు దూరమైన ముస్లింలు ఇప్పుడు మెల్లమెల్లగా పోలరైజ్ అవుతున్నారు.

    కాంగ్రెస్ కి పెరిగే ఓట్లు మిత్ర పక్షాల నుంచే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు..