Pakistan : నాలుగు నెలల్లో మూడు ముస్లిం దేశాల్లో తిరుగుబాట్లు.. ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి బలవంతంగా బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అతివాదులు అధికారంలోకి వచ్చి అల్లకల్లోలం దేశంలో సృష్టిస్తున్నారు. నిన్నటికి నిన్న డిసెంబర్ 8న సిరియాలో బషీర్ అసదాపై తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయాడు.
2011లో అరబ్బు దేశాలలో మిలటరీ, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు జరిగింది. ఈజిప్ట్, లిబియాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. సివిల్ వార్ కొనసాగుతున్న పరిస్థితులున్నాయి. యెమన్ పాలకుడు వెళ్లిపోగా దేశం రెండుగా విభజించబడింది. సిరియాలో ప్రజలు తిరుగుబాట చేసినా ఇన్నాళ్లకు అధ్యక్షుడు పారిపోవడంతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది.
ట్యూనీషియా లో కూడా నియంతలపై తిరుగుబాటుచేశారు. ముస్లిం దేశాల్లో ఎక్కడా స్టెబిలీటీ ఉండడం లేదు. ఉన్నా మానవ హక్కులు ఉండవు.. ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉండదు. సుమారు 50 ముస్లిం దేశాలు ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు రాచరిక పాలనలో ఉన్నాయి. లేదంటే మిలటరీ నియంత్రృత్వంలో ఉన్నాయి. లేదంటే ప్రజాస్వామ్యం పేరుకే ఉన్న దేశాలుగా ఉన్నాయి. గల్ఫ్ లోని అరబ్ దేశాలు రాచరిక పాలనలోనే ఉన్నాయి. సెంట్రల్ ఏషియా లో మొత్తం మిలటరీ పాలనలోనే ఉన్నాయి.
ప్రజాస్వామ్యానికి ఇస్లాంకి ఎందుకు పొసగటం లేదు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.