Bihar Assembly Elections 2025: బీహార్ ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల నవంబర్ 6-11 వ తేదీల్లో పోలింగ్.. 14వ తేదీన లెక్కింపు జరుగనుంది. బీహార్ ఎంతో ముఖ్యం. బీజేపీకి పట్టున్న హిందీ రాష్ట్రాల్లో రెండో పెద్ద రాష్ట్రం బీహార్. జయప్రకాష్ నారాయణ్ పుట్టింది.. కార్యస్థలం అక్కడే..
నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్ లు కీలక నేతలు. నితీష్ వరుసగా 21 ఏళ్లు సీఎంగా వరుసగా పనిచేశారు. నితీష్ ప్రధాని మోడీతో మీటింగ్ లో చూస్తే ఆరోగ్యం, మానసిక స్థితి బాగాలేదని అర్థమవుతోంది. అయినా నితీష్ ను బీహార్ లో ఎవరూ ఇగ్నోర్ చేయడం లేదు. నితీష్ కు బీహార్ లో ఎంతో ప్రాధాన్యత ఉంది.
బీహార్ లో కుల పట్టింపులు ఎక్కువ. కులంను విడదీయలేము. బీసీలు రాజకీయ శక్తిగా ఉన్నారు. 54శాతం వరకూ ఉన్నారు. యాదవ్ లు బీసీలు అయినా అత్యంత శక్తివంతమైన కమ్యూనిటీగా బీహార్ లో ఉన్నారు. యాదవ డామినేషన్ ను తట్టుకోలేకనే తిరుగుబాటు ను మిగతా కులాల వారు చేశారు. నితీష్ వీరికి నాయకుడు..
బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను, ఎన్డీఏ కూటమి (NDA) మరియు ఆర్జేడీ-కాంగ్రెస్ వాపక్షాల మహా ఘట్‌బంధన్ (Mahagathbandhan) మధ్య నువ్వా నేనా అన్నట్టుగా తీవ్ర పోటీ నెలకొంది.
బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.