India Economic Progress: దేశ ఆర్థిక ప్రగతిలో రాష్ట్రాలు ఎలా ముందుకెళుతున్నాయి. ఏ రాష్ట్రాలు ముందంజంలో ఉన్నాయి. ఏ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని రాష్ట్రాల ప్రగతి పై ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది. అందులోని 2024-25 గణాంకాలు చూస్తే..
దేశంలో 45.31 లక్షల కోట్ల జీడీపీతో మహారాష్ట్ర దేశంలోనే టాప్ లో ఉంది. తర్వాత తమిళనాడు, యూపీ ఉన్నాయి. ఇందులో ఆంధ్ర 9వ స్థానంలో.. తెలంగాణ 8వ స్థానంలో ఉంది.తెలంగాణ 16.41 లక్షల కోట్లు, ఆంధ్రా 15.93 లక్షల కోట్లతో జీఎస్.డీపీ సంపద తో ఈ స్థానాల్లో నిలిచారు.
పర్ క్యాపిటా ఎంఎస్.డీపీ లో ఢిల్లీ నంబర్ 1, తెలంగాణ 2వ స్థానంలో కర్ణాటక 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 13వ ర్యాంకలో ఉంది.
క్యాపిటల్ ఎక్స్ పెనేడేచర్ చూస్తే.. ఉత్తప్రదేశ్ ఎవరికి అందనంత దూరంలో ఉంది. మహారాష్ట్ర 2వ స్థానంలో.. తమిళనాడు మూడో స్థానంలో తెలంగాణ 11, ఏపీ 7వ స్థానంలో ఉంది.
దేశ ఆర్థిక ప్రగతిలో ఏయే రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..