Andhra Pradesh districts: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యస్థీకరణపై ఆగస్టులో కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారు. అంతకుముందు ప్రభుత్వం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. టీడీపీ దీన్ని విమర్శిస్తూ జిల్లాలను మార్చుతామని.. స్థానిక అవసరాలకు అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. దీనిపై ప్రజలు ఎదురుచూశారు. కేబినెట్ లోనూ తీర్మానం చేశారు.
కేబినెట్ ఉపసంఘానికి పలు సూచనలు, ఎప్పుడు పూర్తిచేయాలన్న దానిపై కండీషన్లు పెట్టారు. సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసి కేబినెట్ కు పంపించాలని చెప్పారు.
అయితే ఆ టూర్ జరగలేదు. జిల్లాలపై చర్చించలేదు. పునర్వస్తీకరణపై ఎలాంటి ముందడుగు పడలేదు. సడెన్ గా ఒక వార్త బయటకొచ్చింది. అమరావతి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు చేస్తారని వార్తలు వచ్చాయి. కొన్ని అసెంబ్లీలు మారుస్తున్నారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల తిరిగి కూర్పు ప్రక్రియ ఏమైంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషనను కింది వీడియోలో చూడొచ్చు.
