Mamata Banerjee : నిన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కఠిన చట్టం తీసుకొచ్చింది. అత్యాచారాలు చేసే వారికి వ్యతిరేకంగా ఈ చట్టం చేసింది. అసలు చట్టాలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? చట్టాలు అమలు చేసే నేతలు నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం లేదా? పశ్చిమ బెంగాల్ లో జరిగింది ‘ఉన్న చట్టం లేక నిందితుడు తప్పించుకున్నాడా?’ అన్నది ఆలోచించాలి.
ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో 31 ఏళ్ల డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేస్తే.. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడం.. ఆ ప్రిన్సిపల్ ను సేవ్ చేయడానికి ప్రయత్నించడం.. ఎక్కడైతే జరిగిందో ఆ క్రైం సీన్ ను సాక్ష్యాలు లేకుండా తుడిచేయడమే సమస్యగా మారింది.
కఠినంగా చట్టం తీసుకొచ్చినా అమలు చేసే మనసుందా? మీరు చేసే పనులన్నీ చట్టం ఉన్నప్పుడే జరిగాయి కదా? చట్టం ను ఎందుకు అమలు చేయడం లేదని అందరూ అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పకుండా గబ్బాలు కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మమతా బెనర్జీ ఇప్పటికీ ఆ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయలేదు. సీబీఐ అరెస్ట్ చేశాక సస్పెండ్ చేసింది. ఇప్పుడు అందరు వేలెత్తి చూపిస్తున్నారని.. చట్టాల పేరుతో హంగామా చేయడం ఎంత వరకూ కరెక్ట్ చెప్పాలి.
మమతా దీదీ చట్టాలు కాదు అమలు చేసే మనసుండాలి’ బెంగాల్ పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.