https://oktelugu.com/

Bigg Boss 8′ contestant Sonia : బిగ్ బాస్ 8′ కంటెస్టెంట్ సోనియా కి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏమి అవుతాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లైవ్ వీడియో చాట్ ద్వారా సోనియా కి శుభాకాంక్షలు తెలియచేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొత్తగా కనిపిస్తున్న ఈ అమ్మాయికి రామ్ గోపాల్ వర్మ విష్ చేయడం ఏమిటి?, ముందుగానే వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదా?, లేదా రామ్ గోపాల్ వర్మ కి సంబంధించిన బంధువులా?, ఇలా రకరకాల అనుమానాలు ఏర్పడ్డాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 4, 2024 / 08:10 PM IST

    Bigg Boss 8' contestant Sonia

    Follow us on

    Bigg Boss 8′ contestant Sonia : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో కేవలం ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేనివారు. సోషల్ మీడియా ని రెగ్యులర్ గా అనుసరించే వారికి నేడు రెగ్యులర్ ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తున్న కంటెస్టెంట్స్ సుపరిచితమే. కానీ సోషల్ మీడియాని అనుసరించే వారికి కూడా తెలియని కంటెస్టెంట్స్ కూడా ఈ సీజన్ లో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సోనియా. తెలంగాణ లోని మంథా ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండే ఫైర్ బ్రాండ్ గా అనిపించింది. మనసులో ఉన్న మాటలను నిర్మొహమాటంగా చెప్పే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది కానీ, కొన్ని అనవసరమైన విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం ఈమెలోని మైనస్ పాయింట్ గా కనిపిస్తుంది. నిన్న నామినేషన్స్ లో కూడా ఈమెనే ఎక్కువగా రచ్చ చేసింది.

    అయితే ఈమె హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లైవ్ వీడియో చాట్ ద్వారా సోనియా కి శుభాకాంక్షలు తెలియచేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొత్తగా కనిపిస్తున్న ఈ అమ్మాయికి రామ్ గోపాల్ వర్మ విష్ చేయడం ఏమిటి?, ముందుగానే వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదా?, లేదా రామ్ గోపాల్ వర్మ కి సంబంధించిన బంధువులా?, ఇలా రకరకాల అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఈమె గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కరోనా వైరస్’,’ఆశ ఎన్కౌంటర్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అదే విధంగా ‘జార్జి రెడ్డి’ చిత్రంలో హీరోయిన్ కి చెల్లి పాత్రలో కనిపించింది. వర్మ తో రెండు సినిమాలు చేసింది కాబట్టి అతనితో ఈమెకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరు కలిసి వీకెండ్స్ లో ప్రైవేట్ పార్టీలకు, పబ్బులకు వెళ్లేవారు.

    అలా వీళ్లిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం తో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సక్సెస్ అవ్వాలని రామ్ గోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలియచేసాడు. కానీ ఈ అమ్మాయి ఆడియన్స్ కి పెద్దగా తెలియపోవడంతో ఈ వారం ఈమె ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఆమె నామినేషన్స్ లోకి వచ్చింది. సోషల్ మీడియా లో జరుగుతున్న పోలింగ్ ప్రకారం అందరికంటే చివర్లో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వారంలో ఆమె గేమ్ ఆడే అవకాశం వస్తే, తనని తయారు నిరూపించుకునే అవకాశం ఉంటుంది. గతం లో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అరియానా, అషు రెడ్డి వంటి వారితో రామ్ గోపాల్ వర్మ ఎలాంటి రొమాంటిక్ చిట్ చాట్ చేసాడో మన అందరికీ తెలిసిందే. అషు రెడ్డి తో ఆయన అనేకసార్లు ముద్దు కూడా పెట్టించుకున్నాడు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సోనియా కూడా బయటకి వెళ్ళగానే రామ్ గోపాల్ వర్మతో అలాంటి చిట్ చాట్ ప్లాన్ చేయబోతుందా అనేది చూడాలి.