ఒక వైపు రాజధాని నిర్మాణం మొదలుకాకముందే.. కేంద్రం అమరావతి రైలు నిర్మాణం మొదలు పెట్టడం.. మరోవైపు బెస్ట్ బైపాస్ రింగ్ రోడ్స్ వస్తున్నాయి. ఇంకో వైపు పోలవరం పనులు చకచకా మొదలు కాబోతున్నాయి. ఆంధ్రాకు పెట్టుబడుల వరద వస్తోంది. అదానీ ప్రపోజల్స్, అంబానీ పెట్టుబడులు.. టాటా ఒప్పందాలు, ఎంఎన్.సీ స్టీల్స్ ప్లాంట్స్.. ఇలా ఎన్నో సర్ ప్రైజ్ లు ఏపీకి వస్తున్నాయి. ఒక విధంగా ఐదేళ్లలో పోగొట్టుకున్నామని బాధలు మరిచిపోయేలా పెట్టుబడుల వరద వస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే 85వేల కోట్ల పెట్టుబడులు.. 34 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒక్క ఆర్సెల్లార్ మిట్టల్ నే దాదాపు 61వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే ఏపీలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. విద్యాసంస్తలు, హోటల్స్ అన్నీ వస్తుంటే పీపీపీ మోడ్ లో రాష్ట్ర రహదారులకు మోక్షం వస్తే ఎంత హాయి ఈరేయి అని చెప్పకతప్పదు.
సోషల్ మీడియాలో రెచ్చిపోయిన కేటుగాళ్లను అరెస్ట్ చేస్తూ ఆరునెలల్లోనే కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఆకట్టుకుంటున్నాయి..