Udhayanidhi Stalin : తమిళనాట రాజకీయాలు వేడివేడిగా మారుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ అతి త్వరలో డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారట.. ఇది కావాలనే సీఎం స్టాలిన్ లీక్ చేసినట్టు అనిపిస్తోంది. వారి అనుకూల మీడియా దీనిపై జోరుగా కథనాలు రాస్తోంది. హీరో విజయ్ రాష్ట్ర సదస్సు జరుగబోతోంది. ఆఫీస్ బేరర్స్, విధి విధానాలు రూపకల్పన జరుగబోతోంది. తమిళనాట ఇండీ కూటమిలో కొత్త కొత్త డిమాండ్లు మొదలయ్యాయి.
స్టాలిన్ విషయంలో ఏంటంటే.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. రెండో తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక ఉందట.. ముందుగా డిప్యూటీ సీఎం చేసి.. మొత్తం రోజువారీ కార్యక్రమాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఉదయనిధికి ఆ కెపాసిటీ ఉందా? అన్నది తెలుసుకుందాం.. కానీ ఆయనకు అవి లేనట్టు అనిపిస్తోంది.
డీఎంకే కు సన్ స్ట్రోక్ తగిలినట్టు కనిపిస్తోంది. వీళ్ల కూటమిలో కొత్త డిమాండ్లు మొదలయ్యాయి. దళిత పార్టీ నేత తిరుమలవర్ ట్వీట్ చేసి డిలీట్ చేశాడు. 2026 ఎన్నికలకు సంబంధించి ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశాడు. పాలనలో భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో జనసేన, బీజేపీకి ఇచ్చినట్టు ఇవ్వాలని కోరుతున్నారు.
త్వరలో ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.