British India 12 countries : మన దేశం విభజన అనగానే భారత్ -పాకిస్తాన్ అని మాత్రమే అనుకుంటాం. కానీ బ్రిటీష్ ఇండియా చాలా పెద్దది. ఇటు వైపు దుబాయ్ నుంచి.. రంగూన్, సింగపూర్ దాకా బ్రిటీష్ చేతిలోనే ఉండేది. ఈ భూభాగం మొత్తానికి పాలన ఢిల్లీ నుంచే జరిగేది.
భారత్, పాకిస్తాన్, బర్మా లలో ప్రావిన్సులు ఉండేవి. మొత్తం 8 ప్రావిన్సులు ఉండేవి. దాంతోపాటు రక్షిత రాజ్యాలు ఉండేవి. బ్రిటీష్ వాటిని సంరక్షించేది. సిక్కిం రాజ్యంగా ఉండేది, భూటాన్, బెలూచిస్తాన్, సంధి రాజ్యాలు (అబూదాబి, దుబాయ్, ఇతర గల్ఫ్ కంట్రీస్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఏడెన్ లు బ్రిటీష్ కింద సామాంత రాజ్యాలుగా ఉండేవి.
ఇవి కాకుండా ఇన్ ఫార్మల్ ప్రొటెక్టేట్స్ ఉండేవి. వాళ్లు వైస్రాయి కిందనే ఉంటారు. ఆర్మీ బ్రిటీష్ చేతుల్లోనే ఉండేది. మస్కట్, ఒమన్, నేపాల్ లు బ్రిటీష్ చేతుల్లోనే రక్షణ ఉండేది.
బ్రిటీష్ వారు పరిపాలించినా రెండు దేశాలు బ్రిటీష్ కింద పెట్టలేదు.శ్రీలంక, మాల్దీవులను సపరేట్ గా పాలించారు. 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం ఇచ్చారు. మాల్దీవులను కూడా సపరేట్ రాజ్యంగా ఉంచారు.
బ్రిటీష్ ఇండియాలో భాగంగా బ్రిటీష్ సౌత్ ఏసియా దేశాలు సింగపూర్ వరకూ ఉండేది. 1967 దాకా బ్రిటన్ కింద ఉన్నాయి. బెంగాల్ ప్రెసిడెన్సీ కిందనే ఈ సౌత్ ఏషియా దేశాలున్నాయి.
బ్రిటీషు ఇండియా క్రింద ఇప్పటి 3 దేశాలు కాదు 12 దేశాలుండేవి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.