Telangana Caste Census : కులగణన.. తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి చేసింది ఇదే మొదటిది కాదు.. వాళ్ల కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటక రాష్ట్రంలో చేసింది. కానీ పబ్లిష్ చేయలేదు. తర్వాత బీహార్ చేసి పబ్లిష్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక తెలంగాణ ప్రభుత్వం చేసింది. కేంద్రమే సోషియా ఎకనామిక్ సర్వేను యూపీలో చేసింది. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ చేసినా దాన్ని పబ్లిష్ చేయలేదు.
ఇక ఈయన ఏదో తెలంగాణలో కులగణన చేశానని చెప్పుకొని కొరివితో తలగోక్కున్నాడు. చిదంబరం సోషియో ఎకనామిక్ సర్వే చేశాడు. సిద్దరామయ్య కూడా చేశాడు. కానీ వాళ్లు పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే అదంతా తప్పుల తడక అని వారికి తెలుసు. దీనివల్ల లాభనష్టాల కన్నా తన పదవి ఉండాలంటే రాహుల్ గాంధీ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని ఈ కులగణన రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుస్తోంది. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి చేసినట్టు అర్థమవుతోంది.
కుల గణనలో సమాధానాలు కన్నా సందేహాలే ఎక్కువ.. తెలంగాణ కులగణనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.