Budget 2024 : ఆంధ్రాకు ప్రత్యేక నిధులిస్తే కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడింది?

ఆంధ్రాకు ప్రత్యేక నిధులిస్తే కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : July 23, 2024 8:44 pm

Budget 2024 : బడ్జెట్ వచ్చేసింది. బడ్జెట్ పై విపరీతమైన వ్యాఖ్యానాలు టీవీల్లో చూస్తున్నాం.. ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని మండిపడిపోతున్నాయి ప్రతిపక్షాలు.. వారు మాట్లాడేదాంట్లో నిజముందా? ఎందుకు మిగతా రాష్ట్రాలను రెచ్చగొడుతున్నాయి. కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడింది.

ఆంధ్రాకు కొన్ని ప్రత్యేక నిధులు ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దేశం మొత్తం రచ్చ చేస్తోంది. నిన్నటివరకూ ఇదే కాంగ్రెస్ వ్యక్తులు ఏపీ,బీహార్ కు ప్రత్యేక హోదా కావాలన్నారు. కానీ ఇప్పుడు ఇవ్వగానే ఈ రెండు రాష్ట్రాలకు నిధులు ఇచ్చారని.. మిగతా రాష్ట్రాలను ఎగదోస్తూ పబ్బం గడుపుతున్నాయి.

ఆంధ్రాది మాట్లాడే ముందు.. బీహార్ రాష్ట్రం దేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. పర్ క్యాపిటల్ ఇన్ కం దేశంలోనే అత్యల్పంగా ఉంది. ఇవ్వకపోతే తప్పు.. బీహార్ కు ప్రత్యేక నిధులు ఇవ్వడం అందరూ ఆమోదించాల్సిన వాస్తవం.

భారత్ అభివృద్ధి కావాలంటే తూర్పు భారతం అభివృద్ధి చెందాలని మోడీ ఎప్పటి నుంచో చెబుతోంది. విభజనతోనే బీహార్ నష్టపోయింది. మినరల్స్ ఉన్న జార్ఖండ్ బాగుపడింది. బీహార్ నష్టపోయింది.

ఇక ఆంధ్రా విభజన సమయంలోనే ప్రత్యేక హోదా సహా పోలవరం పూర్తికి కేంద్రప్రభుత్వమే హామీ ఇచ్చింది. ఇప్పటికి ఆంధ్రాకు నిధులు కేటాయిస్తే ఇంత గొడవ ఎందుకు?

ఆంధ్రాకు ప్రత్యేక నిధులిస్తే కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.