Senatho Senani: విశాఖలో జనసేన మూడు రోజుల పండుగ జరుగబోతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో అందుకే 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు. డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఆయన తీసుకున్న శాఖలు ప్రజాదరణ సాగించాయి. పంచాయితీ రాజ్ లో అన్ని గ్రామ సభలు ఒకేరోజు నిర్వహించి రికార్డ్ సృష్టించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. జలజీవన్ మిషన్, అటవీ శాఖలో కుకీ ఏనుగులు తెచ్చాడు.
డిప్యూటీ సీఎంగా తిరుపతి సభతో సనాతన పరిరక్షకుడిగా దేశవ్యాప్త ఖ్యాతి గడించారు. ఇప్పుడు విశాఖ సభపై పవన్ అడుగులు ఆసక్తి రేపుతున్నాయి..
నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లాంటి జనసేన మంత్రులు కూడా పాలనలో శాఖలు బాగా నిర్వహిస్తూ జనాదరణ పొందుతున్నాడు.
ఇక తన ప్రవృత్తిలో భాగంగా మూడు సినిమాలు పూర్తి చేస్తున్నాడు. హరిహరవీరమల్లు పూర్తి చేశాడు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. సినిమాల వల్ల పార్టీ కార్యక్రమాలు కుంటుపడ్డాయన్నది ఒక ప్రధాన ఆరోపణ.. ప్రభుత్వంలో, పార్టీలో పవన్ గ్యాపులు ఇచ్చాడని అంటున్నారు.
మూడు రోజులు విశాఖలో సేనతో సేనాని పవన్ కళ్యాణ్ అడుగులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
