Allu Arjun AA22A6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో ఒక సినిమా కొద్దిరోజుల క్రితమే మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, దీపికా పదుకొనే ఈ సినిమా కోసం సిద్ధం అవుతున్నట్టు గా విడుదల చేసిన రెండు వీడియోలు సోషల్ మీడియా లో ప్రకంపనలు పుట్టించాయి. కేవలం ఈ వీడియోలే ఈ రేంజ్ క్వాలిటీ తో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో కాదు, పాన్ వరల్డ్ స్పాన్ తో తెరకెక్కుతుంది. ఎదో పేరుకి హాలీవుడ్ లో కూడా విడుదల చేసాము అన్నట్టు కాకుండా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ చిత్రం కూడా ఇదే రేంజ్ ప్రమాణాలతో తెరకెక్కుతుంది. కానీ అల్లు అర్జున్ చిత్రం అంతకు మించేలా అనిపిస్తుంది.
ప్రస్తుతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యూనిట్ ని ప్రముఖ హాలీవుడ్ సంస్థ కోనెక్ట్ మొబ్ సీన్ ఎగ్జిక్యూటివ్ విస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా ఈ విస్కోంటి కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రముఖ హాలీవుడ్ సంస్థల్లో పని చేసిన అలెగ్జాండ్రా అవతార్, డూన్, జురాసిక్ వరల్డ్, బార్బీ, ఫాస్ట్ & ఫ్యూరియస్ తో కలిపి వందకు పైగా హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాలకు ఆమె మార్కెటింగ్ స్ట్రాటెజిస్ట్ గా పని చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం పని చేస్తుంది. కచ్చితంగా అన్ని హాలీవుడ్ మార్కెట్స్ లో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో రిలీజ్ అవ్వడం పక్కా అని చెప్పొచ్చు. సినిమాలో విషయం ఉంటే ఈ చిత్రం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేస్తుంది.
ఇకపోతే ఈ చిత్రం లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుష్ప సిరీస్ లో అల్లు అర్జున్ సరసన నటించి పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఈ సినిమాలో విలన్ క్యారక్టర్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఆమె కూడా సెట్స్ లో పాల్గొనబోతుంది. అదే విధంగా సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ, లేడీ కమెడియన్ సోవై సరళ, తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.