Srinagar Polling :  మూడు దశాబ్దాల రికార్డు పోలింగ్ తో శ్రీనగర్ లో గెలిచిన భారత్

పోలింగ్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారని వారు పేర్కొనడం కలకం రేపింది. అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Written By: NARESH, Updated On : May 15, 2024 2:00 pm

Record voter turnout in Srinagar

Follow us on

Srinagar Polling : శ్రీనగర్ లో అద్భుతం జరిగింది. శ్రీనగర్ లోక్ సభకు ఎన్నిక జరిగింది. ఏ పార్టీ గెలిచినా కూడా ఇక్కడ అద్భుతమే జరిగింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం కంటే పెద్దది. భారత్ లోని కశ్మీర్ లో ఎన్నికలు జరుగవద్దని.. ప్రజాభిప్రాయం బయటపడవద్దని పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎగదోసి ఎంత హింసకు పాల్పడిందో చూశాం. ప్రజలు ఓట్లు వేయరని.. భారత్ ను దురాక్రమణ దారుగా కశ్మీరీలు చూస్తారని అంతా అనుకున్నారు.

కానీ పోలింగ్ కశ్మీర్ లో బాగా జరిగింది. ఏకంగా 37.98 శాతం నమోదైంది. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం గత దాదాపు 35 ఏళ్లలో రెండవ అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేసింది, ఇది ఓటు ద్వారా తమ వాణిని వినిపించాలనే ప్రజల సంకల్పానికి నిదర్శనం.

Record voter turnout in Srinagar

2019 లోక్‌సభ ఎన్నికల్లో 14 శాతంతో పోలిస్తే, ఈసారి పోలింగ్ శాతం 250 శాతానికి పైగా పెరగడం విశేషం.

నేషనల్ కాన్ఫరెన్స్ (NC) , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) పోలింగ్ సమయంలో “అధికారిక జోక్యం” ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ సమయంలో తమ పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారని వారు పేర్కొనడం కలకం రేపింది. అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags