Yogi Adityanath Operation Langda : యోగి ఆధిత్యనాథ్ .. 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్థులను ఎలా పరిగెత్తించాడంటే.. వాళ్లు భయపడి ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. కరుడుగట్టిన నేరస్థులు అందరూ అయితే లొంగిపోయారు. లేదంటే ఎన్ కౌంటర్ లో పోయారు. లేదంటే ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. ఇదే యూపీలో శాంతిభద్రతలను సెట్ చేసింది.
బీమారు రాష్ట్రం అన్న పేరున్న యూపీకి మోస్ట్ హ్యాపియెస్ట్ స్టేట్ గా మారిపోయింది. నోయిడా లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. పెద్ద కంపెనీలు యూపికి క్యూ కడుతున్నాయి. మార్కెట్లకు చూసుకున్నా అది పెద్ద మార్కెట్. బ్రెజిల్ దేశపు జనభా 25 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ లో ఉంది.
ఈ ఐదేళ్లలో యోగి యూపీని సెట్ రైట్ చేశాడు. శాంతిభద్రతలను పటిష్టం చేశాడు. అంతపెద్ద రాష్ట్రాన్ని గాడినపెట్టాడు. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ‘ఆపరేషన్ లంగ్డా’ అనే పేరుతో నేరస్థులపై యోగి యుద్ధం ప్రకటించాడు. 24 గంటల్లో 11 చోట్ల ఎన్ కౌంటర్లు చేశారు. 14 మంది కరుడుగట్టిన నేరస్థులను అరెస్ట్ చేశారు.
యోగి మరోమారు నేరస్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాడు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
