Operation Sindoor : ఆపరేషన్ సింధూర్..ఆ పేరులోనే దాని లక్ష్యమేంటో తెలుస్తోంది. మహిళలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిపినటువంటి మిషన్ ఇదీ. జరిగిన అన్యాయంతోపాటు ఉగ్రవాద కూకటి వేళ్లతో పెకిలించడం.. జరిపింది. లష్కరే తోయిబా సంస్థ అయినా మిగతా అన్ని ఉగ్ర స్థావరాల కేంద్రాలను ధ్వంసం చేసింది. 9 లోకేషన్లలో 21 స్ట్రైక్స్ తో కేవలం 24 నిమిషాల్లో మొత్తం దాడులు నిర్వహించారు.
ఈ మెసేజ్ తో మీరు మా దేశంపై ఎలాంటి దాడి చేసినా వదలమని.. ప్రతీకార దాడి ఉంటుందని స్పష్టం చేసినట్టైంది. ఒకనాటిలాగా కామ్ గా ఉండే పరిస్థితి లేదని.. ఎదురుదాడి చేస్తామని భారత్ నిరూపించింది.
పాకిస్తాన్ లో సేఫ్ అన్నది ఏది లేదు. ఎక్కడైనా.. ఏ చోట అయినా భారత్ దాడి చేస్తుందని నిరూపించింది. అతి తక్కువ డ్యామేజ్ తో లక్ష్యాలపై బాంబులు వేశారు. చైనా డిఫెన్స్ వ్యవస్థ పాక్ వద్ద ఉంది. వాటికి అందనంత చాకచక్యంగా భారత్ ఈ దాడులు చేసింది.
పాకిస్తాన్ గుండెకాయ పంజాబ్ లో భారత్ దాడి చేయడం కీలకం.. పంజాబ్ నగరాన్ని ఆనుకొని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ మీద బాంబులు వేయడం భారత్ సత్తాను నిరూపించింది. ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడో ఉన్నాయో భారత్ ఇప్పుడు ప్రపంచానికి తెలిపింది. ప్రపంచానికి పాకిస్తాన్ ను భారత్ ఎక్స్ పోజ్ చేసింది. ఉగ్రవాదాన్ని పాక్ ఎలా పెంచిపోషిస్తుందో ప్రపంచానికి చాటి చెప్పింది. పాక్ డిఫెన్స్ సిస్టంను ఛేదించి పాక్ పై బాంబు దాడి చేసింది.
ఆపరేషన్ సిందూర్ తో ప్రపంచానికి భారత్ ఏం చెప్పింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
