West Bengal : పంజాబ్ భగ్గుమంటోంది. పాలన అక్కడ ఉందా? అని సందేహమేస్తోంది. మమతా బెనర్జీ అంతటి దరిద్రపు పాలన ఇంకెక్కడా లేదు. ఆవిడ ఏది అనుకుంటే అదే పాలన..దాని కోసం ఆవిడ ఎక్కడిదాకానైనా వెళుతుంది. ఏ పనైనా చేస్తుంది. ఎవరినీ లెక్కచేయదు. చట్టాలను అసలే లెక్క చేయదు. ఒక సెక్షన్ ను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రెచ్చగొడుతోంది. అవినీతి విషయంలో అసలు బెంగాల్ లో దారుణంగా ఉంది. పరీక్షలు రాయకుండా టీచర్లను అపాయింట్ చేయడం వివాదామైంది.
వేల కోట్లు తిన్న మంత్రులు జైల్లో ఉన్నారు. మహిళలకు దారుణాతి దారుణంగా ఉంది. సందేశ్ ఖలీ లో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి.నాగరిక సమాజంలో అసలు బెంగాల్ లో లాంటి పాలన ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి? అని తెలియడం లేదు.
నిన్న ముర్షిదా బాద్ లో హిందువుల ఇళ్లపై పడి వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా దాడులు భయభ్రాంతులకు గురిచేశారు. హిందువులు పారిపోయి తలదాచుకునే పరిస్థితులు తలెత్తాయి.పశ్చిమ బెంగాల్ లో మెజార్టీ హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. ముషీరాబాద్ సంఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బెంగాల్ లో రాష్ట్రపతి పాలన ఒక్కటే శరణ్యం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
