Vizag Steel Plant : ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధికారులు.. మరోక్కసారి విశాఖ ఉద్యమం విషయంలో ఇది నిరూపితమైంది. మోడీ ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్ ను గౌరవించింది. నిన్న సీనియర్ ప్రభుత్వ అధికారి మీడియాకు లీకులు ఇచ్చారు. సూత్రప్రాయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకూడదని నిర్ణయించారు. ‘సెయిల్ ’లో విశాఖ ఉక్కును విలీనం చేయాలని నిర్ణయించారు.
ఎకనామిక్ టైమ్స్ కు సీనియర్ అధికారి ఈ మేరకు ఉటంకిస్తూ లీకులు ఇవ్వడంతో ఇది ఆంధ్రప్రజల విజయంగా చెప్పొచ్చు. మోడీ ఎయిర్ ఇండియా లాంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థనే ప్రైవేటీకరణ చేశాడు. ఆంధ్ర లోని విశాఖ ఉక్కు దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రజల సెంటిమెంట్ ను గౌరవించాడు.
1963లో అప్పటి ఆర్థికమంత్రి సుబ్రహ్మణ్యం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెడుతానని ప్రకటించాడు. కానీ అది ముందు పడలేదు. అప్పుడు ఆంధ్రప్రజలు ప్రతీ చోట ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. ఆ ఉద్యమం 32 మంది ప్రాణాలను బలిగొన్నది.. ఇంతపెద్ద ఉద్యమం విశాఖ ఉక్కు కోసం జరిగింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని గౌరవించిన మోడీ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.