Indian Army: మూడు రోజుల్లో ప్రపంచంలో ఏ సైన్యం చేయలేనంత పని భారత సైన్యం చేసింది. మే 8 నుంచి మే 10 వరకూ తను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసింది. 9 వెకేషన్స్ లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టింది. 100కు పైగా కీలకమైన ఉగ్రవాదులను ఏరిపారేసింది. ఇది చిన్న విషయం కాదు. 9వ తేదీ తెల్లవారుజామున భారత్ పై పాక్ దాడులకు దిగబడ్డారు. దీంతో లాహోర్ ఎయిర్ ఢిఫెన్స్ సిస్టంను భారత్ తుత్తునియలు చేశారు. 10వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్ ఎయిర్ బేస్ ల మీద దాడి చేసి ధ్వంసం చేసింది. ఇది కొన్ని స్థావరాల్లో 50కి పైగా వారి సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.
అది చేస్తూనే పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్లు, మిస్సైల్స్ ను సమర్థంగా ఎదుర్కొంది. అఫెన్స్, డిఫెన్స్ రెండింటిలో భారత్ చరిత్రలో లిఖించదగ్గది. ఇజ్రాయెల్ సూసైడ్ డ్రోన్స్ అద్భుతంగా యుద్ధంలో పనిచేశాయి. 10 గంటల పాటు ఆకాశంలో ఉండి పక్కాగా స్కెచ్ వేసి మరీ ధ్వంసం అయ్యాయి.
అమెరికా లాంటి వాళ్లకు, రష్యా, చైనాకు మింగుడు పడని వ్యవహారం ఇదీ. భారత్ ఈ పద్ధతుల్లో చేయగలదా? అని ఆశ్చర్యపోవడం అందరి అంతైంది. చైనా అస్త్రాలేవీ పాకిస్తాన్ లో పనిచేయలేదు. మనం పాక్ క్షిఫణులు, డ్రోన్స్ ను ఆపగలిగాం.. ప్రిసిషన్స్ స్ట్రైక్స్ ను ఎంతో అద్భుతంగా అడ్డుకోగలం..
ఈ దాడిలో మన సొంత నేవిక్ సిస్టం వాడాం.. ప్రపంచవ్యాప్తంగా వాడే జీపీఎస్ కాకుండా భారత్ తయారు చేసిన నేవిగేషన్ సిస్టంతో ఈ యద్ధంలో పాక్ ను చావుదెబ్బ తీశాం. అలాగే.. అడ్వాన్స్ డ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టం (ఆకాశ్ థీమ్) అద్భుతంగా పనిచేసి నిరూపించింది.
భారత్ ఇంత టెక్నాలజీ వాడగలదా? అని ప్రపంచానికి తెలియదు. భారత్ శక్తి సామర్థ్యాలు, టెక్నాలజీ గురించి ప్రపంచానికి తెలిసి వచ్చింది. అటాక్, డిపెన్్ సిస్టంలు అద్భుతంగా పనిచేశాయి. ఆకాశ్, బ్యారక్ ఇజ్రాయిల్, మన ఆయుధాలు బాగా పనిచేశాయి.
భారత్ ఎందుకు పాకిస్తాన్ తో అంగీకారానికొచ్చింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.