Language Dispute : కమల్ హాసన్.. భాషపై చిచ్చు రగిల్చాడు. రెండు రాష్ట్రాలు తన్నుకునే స్థాయికి తీసుకొచ్చాడు. భాషాభిమానం ఓకే.. కానీ భాషాన్మోదం సరికాదు. దీనివల్ల దేశంలో నష్టం తప్ప లాభం లేదు. ఇది మొట్టమొదట మొదలు పెట్టింది బ్రిటీష్ వారు. మద్రాస్ లో ఎలాగైతే కులాల చిచ్చు పెట్టారో.. జస్టిస్ పార్టీని ఎగదోసి ఆరోజు చిచ్చ రగిల్చారు. భాషలపై వివాదాలు సృష్టించారు.
ఒక్కసారి చరిత్ర చూస్తే.. 1905లో బెంగల్ విభజన వేళ దేశం మొత్తం బ్రిటీష్ వారిపై పోరాటం చేశారు. అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ ఐక్యత దెబ్బతీయడానికి విభజించి పాలించాలని బ్రిటీష్ వారు కుట్రలు పన్నారు. భాష ప్రాతిపదికన ప్రావిన్సులను విభజించాడు. బీహార్, ఒడిషాలను వేరు చేశారు. ఒడిషా వారు నిరసన తెలపడంతో మొట్టమొదటి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఒరిస్సాను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో నిజాంకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమం నిప్పు రగిల్చారు. మద్రాసీల నుంచి ఆంధ్రా కూడా ఇలానే భాష ప్రయుక్తం కోసం పోరాడింది. తర్వాత 1956లో తెలంగాణ, ఆంధ్ర కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేశారు. మనతోపాటు మద్రాస్, కేరళ, కర్ణాటకలు భాష ప్రయుక్త రాష్ట్రాలను దక్షిణాదిన విడగొట్టి ఏర్పాటు చేశారు. 1960 తర్వాత బాంబేలో గుజరాత్ ను సపరేట్ చేసి మహారాష్ట్రను ఏర్పాటు చేశారు. 1966కు వచ్చేసరికి పంజాబ్ నుంచి హర్యానాను వేరు చేశారు.
భాషా వివాదంలో తమిళనాడు, కర్ణాటక.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
