Sharda Peeth Yatra : శారదా పీఠం ఇది ఎక్కడుంది? అంటే శృంగేరి మఠంలో శారదాలయం ఉందని ఎవ్వరైనా చెబుతారు. కానీ వాస్తవం ఏంటంటే.. దీని మూలాలు అక్కడ లేవు. శారదా దేవి ఆలయం ఒరిజినల్ గా ఎక్కడ ఉందని చరిత్ర తరిచి చూస్తే.. కశ్మీర్ లో మూడు అత్యంత ప్రముఖమైన హిందూ తీర్థయాత్రలున్నాయి. ఒకటి అమర్ నాథ్ యాత్ర, రెండూ శారదా యాత్ర, మూడు మార్తండ సూర్యదేవర యాత్ర.. ఈ మూడు కశ్మీర్ లో అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా కశ్మీర్ పండింట్లకు ఆరాధ్యమైనవి..
ఈ శారదాపీఠం కానీ.. శారద ఆలయం కానీ ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి అనే విషయాలపై వివరంగా తెలుసుకుందాం.. శారదాపీఠంకు మనం వెళ్లలేము. ప్రస్తుతం అది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉంది. విభజన తర్వాత కూడా ఈ ఆలయం మన భూభాగంలోనే ఉండేది. కానీ 1948 తర్వాత ఏదైతే పాకిస్తాన్ మన భూభాగాన్ని ఆక్రమించిందో అందులో శారదా ఆలయంలో ఉండిపోయింది. సరిహద్దుకు 17 కి.మీల దూరంలో ఉంది.
ఇది కిషన్ గంగా, మధుమిత నదుల సంగమంగా ఉంది. కిషన్ గంగా అంటే దాన్నే పాకిస్తాన్ లో ‘నీలం నది’ అంటారు. కిషన్ గంగా నది ఒడ్డున శారదా ఆలయం ఉంది. 1947 వరకూ అమర్ నాథ్, మార్తండ సూర్యదేవర ఆలయ యాత్ర, శారదా యాత్రలు చేసేవారు. కానీ దేశ విభజన తర్వాత పాక్ ఆక్రమణతో శారద యాత్ర నిలిచిపోయింది.
బంద్ అయిన కూడా 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత భుట్టో బతిమిలాడడంతో 90వేల మంది పాక్ సైనికులను ఇందిరాగాంధీ ఊరికే వదిలిపెట్టేసింది. శారద ఆలయం సహా కర్తార్ పూర్ గురుద్వారాలను మాకు ఇచ్చి మిగతా కశ్మీర్ ను తీసుకోమని చెబితే బాగుండేది.
రవీంద్ర పండిత హిందువుల శారదా పీఠం యాత్ర స్వప్నం నెరవేరేనా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి